Thursday, September 18, 2008

రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాదు ...

మొత్తానికి 2 సంవత్సరాల తర్వాత పట్నం (హైద్రాబాదు) ప్రయాణం అవుతున్నాను.గత రెండు నెలలుగా ఎంతగా ఎదురు చూస్తున్నానంటే ... మరి షంషాబాదు airport ముందు రొడ్డు ముద్దు పెట్టుకొని నా జన్మభూమి ...అని పాడేంతగా కాకపొయినా..ఇంటికెల్లే దారిలొ మూసినది వాసన గాట్టిగా దమ్ము పీల్చి కాసేపు మూర్చ పొవాలనిపించేంతగా అనుకొండి.

భాదించే విషయం ఎంటంటే ఈ ట్రిప్పు కేవలం వారం రొజులే. ఆటొ లో అమీర్ పేట్ నుంచి ఆబీడ్సు అర డజను సార్లు అటు ఇటు తిరిగానంటే ఇట్టే అయిపొతాయ్ (పర్సులొ డబ్బులతొ పాటు). ఉన్న వారం రొజుల్లొ రెండు రోజులు తిరుపతి ట్రిప్పు. ఆపైన షాపింగు, భందువుల ఇళ్ళలొ అటెండెన్సు, స్నేహితులతో మీటింగ్సు.. అబ్బొ అబ్బొ ఇవన్నీ చూస్తుంటే నా బతుకు మిక్సీ లో వెసిన కప్ప లాగుంటుందేమో.


ఈ ట్రిప్ లొ నా wish list
----------------------
కనీసం ఒక్క స్టాపు అయినా సరే సిటి బస్సు లో ప్రయాణం చేయాలి.
కనీసం ఒక్క తెలుగు సినిమా అయినా చూడాలి.
ఒక సాయంత్రం నెక్లెస్ రోడ్డు వెంబడి షికారు.
విశాలాంధ్ర బుక్ షాపు లొ కనీసం కిలో బుక్కు లైనా కొనాలి.
రొడ్డు పక్కన ఎదొ ఒక చెత్త చాట్ లో చాటుగా చాట్, గొల్ గప్ప తినాలి..

ఇంకా చాలా ఉన్నాయ్ కాని గుర్తుకు రావడం లేదు ..
మీకెమైనా తొస్తే చెప్పండి

Friday, September 12, 2008

WTC - ఒక స్మృతి

నేను మొదటి సారి 2000 లో అమేరికా వెళ్ళినప్పుడు, ఒక weekend లొ స్నేహితులను కలవడానికి Newyork వెళ్ళాను. అప్పుడు తీసిన World trade center ఫొటోలు.




మళ్ళి, 2001 రెండవసారి వెళ్ళి నప్పుడు సరిగ్గా 9/11 కు మూడు నెలలు ముందు WTC చూసే అవకాశం దొరికింది. అప్పుడు తీసిన World trade center ఫొటోలు.





కొంచెం creativity చూపిద్దామని బొర్లా పడ్డట్టున్నాను