Thursday, August 21, 2008

రాష్ట్ర రాజకీయాలు - ఒక ITఓడి అబిప్రాయం

మొన్నటికి మొన్న ఈనాడు పత్రిక లో మన CM గారు చిరు పార్టిని, లొక్ సత్తా ను, దేవేందర్ గౌడ్ పార్టి ని ఒకే గాటున కట్టి స్టేట్మెంట్ ఇచ్చేసారు. నిన్నెమో చిరు పార్టి వల్ల కాంగ్రేసుకు వచ్చే నష్టం లేదు అన్నారు. ఇది చదివిన తర్వాత మన CM గారికి సముద్రంలొ వచ్చి పొయే అలలకు సునామి కి తెడా తెలియదేమో అన్న అనుమానం కలగక మానదు. లేదా మెకపొతు గాంభీర్యం ఐనా అయ్యుండాలి.
మన రాష్ట్రంలొ మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే వచ్చే ఏప్రిల్ లో జరిగే ఎన్నికల సగ్రామం మంచి రసకందాయం లో ఉంటుందని చెప్పడం లొ అతిశయోక్తి లెదేమో.

వచ్చె ఎన్నికల్లొ ఆయా పార్టీ ల అవకాశాల గురించి నా అబిప్రాయం.

లొక్ సత్తా ( my 1st favourite) : ఇప్పుడు ఉన్న, వస్తున్న పార్టీలన్నింటిలో strong values and principles ఉన్న పార్టి. New Politics, New Generation అన్న కాప్షన్ చాల బాగుంది. క్రిందటి బై ఎలక్షన్ లొ వోటింగ్ శాతం పరవాలేదు.
బలాలు :
* ఈ పార్టి అంటె ఇష్టం లేని వాళ్ళు తక్కువే ( ఆ మాటకొస్తే ఈ పార్టి గురించి తెలిసినవాళ్ళు కూడ తక్కువే నేమో!)
* మంచి నాయకత్వం
* క్లీన్ history
బలహీనతలు :
* ఖర్చు కొద్ది కుర్చీలు. లొక్ సత్తా కు ఆ సత్తా లేదింకా
* గామ స్తాయి లో లొక్ సత్తా గురించి awareness తక్కువే.
* బలమైన పార్టి కెడర్ లేదు. కార్యకర్తలు కూడ చాల తక్కువె. ( అయినా కొద్దొ గొప్పొ వెనకెసుకొలేని పార్టి ఎవరు చెరుతారు?)
* big chunk of Supporters will go to chiru party
* పార్టి ని సపొర్టు చెసే వారంతా ఓటు వెయ్యక పొవచ్చు. ఓడి పోయే గుఱ్ఱం పంచకళ్యాని గుఱ్ఱమైనా పందెం ఎవడు కాస్తాడు?
జనాలకు దండాలు పెడుతూ తమ పార్టి చెయబోయే మంచి పనులు చెప్పే సైలెంటు నేతల కంటె జీపులు కార్లెసుకొని లౌడు స్పీకర్లతొ దుమ్ము రెపుకుంటు తిరుగుతూ డబ్బు సారా వెదజల్లె వయలెంటు నేతలే గెలిచే ఈ వ్యవస్త లొక్ సత్త కొరకు ఇంకా రెడీ గా లేదెమో.
జయ ప్రకాష్ నారాయణ గారు చెప్పినట్లు మంచి వాళ్ళు గెలిచే సంసౄతి రావారి. మనమేమో అట్లాంటి సంసౄతి కి వెయ్యి క్రోసుల దూరం లో ఉన్నాం. మన రాజకీయ వ్యవస్త లో పెను మార్పులొ చ్చినంత వరకు లొక్ సత్తా సత్తా మనకు తెలిసి రాదేమో
తప్పకుండా వోటింగ్ శాతం పెరుగుతుంది, జనాలలొ ఈ పార్టీ గురించి చర్చ పెరుగుతుంది
కలిసొస్తే ఒకటొ రెండొ సీట్లు వచ్చినా ఆశ్చర్య పొనక్కరలేదు.

చిరు పార్టి (my 2nd favourite) : ఇది రాష్ట్ర రాజకీయాల్లొ ఒక ప్రభంజనం. ఉవ్వెత్తున ఎగుస్తున్న కెరటం. వెండి తెరపై అతనొక హీరో, మంచికొసం పొరాడుతాడు, విలన్లను మట్టికర్పిస్తాడు, అవినీతికి అగెనెస్టు, నిజ జీవితంలొ కూడ అలాగే చెస్తాడేమోనని మనకొ చిన్న హొపు. ప్రస్తుత పరిస్తితులలొ మన రాష్త్రానికి అతనే బెస్టు. ఇంకొడికి ఓటేయడం సుద్ద వేస్టు.
బలం:
* fans following, feel good factor
* baggage/image carries from movies
* best alternative for people fed up with TDP & Congress
బలహీనత:
* రాజకీయాల్లొ అనుభవ రాహిత్యం ( ఇది బలమా బలహీనతా?). people are sceptical about his ability as a leader
* lack of well established party set-up.
కొత్త పార్టి కనుక, డబ్బు పరపతి ఉండి రాజకీయ అర్రంగెట్రం చేయాలనుకునే చాల మందికి మంచి అవకాశం. కాంగ్రేసు టిడిపి బిజెపి లొ రాజకీయ భవిష్యత్తు లేని ( భుమా నాగి రెడ్డి లాంటి వాళ్ళు ) నేతలందరు చిరు పార్టి లొకి దూకెస్తారు.
మంచి ఉద్దేశ్యంతొ చెరే ప్రతి ఒక్కడికి పై కారణాలతొ చెరే వాల్లు పది మంది ఉంటారేమో.
NTR పార్టీ పెట్టి నప్పుడు TDP షాలువా వెసుకొని గెలిచిన వాళ్ళలొ ఎంతమంది NTR ఆశయాలు పాటించారు? కోట్లు ఖర్చు చేసి గెలిచిన ఎంతమంది నేతలు బడుగు/బలహీన/వెనకబడిన వాళ్ళకొరకు పదో పరకో వెనకెసుకోకుండా సాయ పడతారంటారు?
it will be interesting after math if chiru's party forms government!

టిడిపి : చంద్రబాబు నాయుడు గారు గత నాలుగు నెలలుగా అవిశ్రామంగా మీ/మా కొసం అంటూ జనానికి దగ్గరయ్యె తాపత్రయం, దానికి జనం నించి వస్తున్న స్పందన చూస్తే వచ్చే ఎన్నికల్లొ అతి పెద్ద పార్టి అవుతుందేమో అని పిస్తుంది. దెవేందర్ గౌడు కొత్త పార్టి తెలంగాణ లొ TDP ఓట్లు తప్పక చీలుస్తుంది.

కాంగ్రేసు (my least favourite): దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, అదికారం ఉండగానే అందినంత పుచ్చుకో అనంట్లుంది కాంగ్రేసు గవర్నమెంటు attitude. వారు చెసిన ప్రజా సంక్షేమ పథకాలకంటే కార్యకర్తల సంక్షేమ పథకాలే ఎక్కువ. మీడియా పుణ్యమా అని ( ముఖ్యంగా ఈనాడు, ఈ TV) జనాలకు కాంగ్రేసు అవినీతి గురించి awareness ఎక్కువె అయ్యింది. వచ్చే నెల్లల్లొ వాల్లు ప్రకటించబొయే జనాకర్షక పథకాలు ( తాయిలాలు ) ఎలక్షన్ల పై ప్రభావం చూపొచ్చేమో.

నా అంచనా ప్రకారం TDP కి 100 నుంచి 150 సీట్లు. కాంగ్రేసుకు 80 నుంచి 110 సీట్లు, చిరు పార్టికి 50 నుంచి 80 సీట్లు, పదో పదిహేనో TRS కు ఇంచు మించు అన్నే NTPP కి, ఇతరులకు (బీజేపి, MIM, CPI, ఇండిపెండెంట్) 30 వరకు రావచ్చు.
ఎవరికి పూర్తి మెజారిటి రాక నాటకీయ మైన పొత్తులు పర్వం మొదలు కావచ్చు.
TDP కాంగ్రేసు కలవ లేవు కనుక, ఈ ఇద్దరిలొ ఒకరు చిరు పార్టి తొ పొత్తు పెట్టు కొవచ్చేమో లేదా చిన్న చితకా పార్టీలందరిని కలిపి 150 మార్కు దాటెస్తారేమో.
* * *
ఎవ్వరొచ్చినా మన దైనందిక జీవితాల్లొ పెద్ద మార్పులేం రాక పొవచ్చు.
అయినా పళ్ళూడ గొట్టుకోవడానికి ఏ రాయైయితె ఏంటీ?
నాకు మట్టుకు నేను Alt + Tab కొట్టేసి పని చేసుకుంటా

Friday, August 15, 2008

అజ్ఞాత వాసం ముగిసింది



18 నెలల అజ్ఞాత వాసం ముగిసింది.
కాలం గిరుక్కున తిరిగింది. నేను దబుక్కున పడ్డాను, బుడుక్కున లేచాను blah blah...
రెండు సార్లు ఇల్లు మార్చాను రెండు సార్లు ఉద్యొగం మార్చాను.
కొడుకు పుట్టాడు.
ఇన్ని రొజుల్లో ఎన్నో సార్లు బ్లాగు మళ్ళి మొదలెట్టాలి అని తలిచాను, మరిచాను, తలవడం మరిచాను.
మొత్తానికి చాల కాలం తర్వాత వ్రాస్తున్నాను.
మా అబ్బాయి పుట్టినప్పుదు నా స్నేహితులకు భంధువులకు నేను పంపిన ఉత్తరం ..