రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాదు ...
మొత్తానికి 2 సంవత్సరాల తర్వాత పట్నం (హైద్రాబాదు) ప్రయాణం అవుతున్నాను.గత రెండు నెలలుగా ఎంతగా ఎదురు చూస్తున్నానంటే ... మరి షంషాబాదు airport ముందు రొడ్డు ముద్దు పెట్టుకొని నా జన్మభూమి ...అని పాడేంతగా కాకపొయినా..ఇంటికెల్లే దారిలొ మూసినది వాసన గాట్టిగా దమ్ము పీల్చి కాసేపు మూర్చ పొవాలనిపించేంతగా అనుకొండి.
భాదించే విషయం ఎంటంటే ఈ ట్రిప్పు కేవలం వారం రొజులే. ఆటొ లో అమీర్ పేట్ నుంచి ఆబీడ్సు అర డజను సార్లు అటు ఇటు తిరిగానంటే ఇట్టే అయిపొతాయ్ (పర్సులొ డబ్బులతొ పాటు). ఉన్న వారం రొజుల్లొ రెండు రోజులు తిరుపతి ట్రిప్పు. ఆపైన షాపింగు, భందువుల ఇళ్ళలొ అటెండెన్సు, స్నేహితులతో మీటింగ్సు.. అబ్బొ అబ్బొ ఇవన్నీ చూస్తుంటే నా బతుకు మిక్సీ లో వెసిన కప్ప లాగుంటుందేమో.
ఈ ట్రిప్ లొ నా wish list
----------------------
కనీసం ఒక్క స్టాపు అయినా సరే సిటి బస్సు లో ప్రయాణం చేయాలి.
కనీసం ఒక్క తెలుగు సినిమా అయినా చూడాలి.
ఒక సాయంత్రం నెక్లెస్ రోడ్డు వెంబడి షికారు.
విశాలాంధ్ర బుక్ షాపు లొ కనీసం కిలో బుక్కు లైనా కొనాలి.
రొడ్డు పక్కన ఎదొ ఒక చెత్త చాట్ లో చాటుగా చాట్, గొల్ గప్ప తినాలి..
ఇంకా చాలా ఉన్నాయ్ కాని గుర్తుకు రావడం లేదు ..
మీకెమైనా తొస్తే చెప్పండి





12 comments:
భాస్కర్,
మీరు హైదరాబాదులో ఏమైనా చేయండి, మీ ఇష్టం! కానీ విషాలాంధ్ర (విషాల+ఆంధ్ర) అని మాత్రం రాస్తే మాత్రం కుదరదు! విశాలాంధ్ర అని రాయాల్సిందే! అచ్చు తప్పులు చూసి ఊరుకోనక్కర్లేదన్నారుగా, అందుకే ఈ ఒక్క దాన్నీ సవరించాను. ఏమనుకోకండి మరి!
@ సుజాత
సరిచేసాను. విశాలాంధ్ర ను విషాలాంధ్ర అని వ్రాయడం తప్పే
ఒక నిమిషం గొడ కుర్చి వేస్తాను ఇవాళ సాయంత్రం.
>> కనీసం ఒక్క స్టాపు అయినా సరే సిటి బస్సు లో ప్రయాణం చేయాలి. - Are you sure?
>> కనీసం ఒక్క తెలుగు సినిమా అయినా చూడాలి.
ఒక సాయంత్రం నెక్లెస్ రోడ్డు వెంబడి షికారు. - Not a big deal. మంచి తెలుగు సినిమా అనలేదు కదా? ;-)
>> విశాలాంధ్ర బుక్ షాపు లొ కనీసం కిలో బుక్కు లైనా కొనాలి. - కిలో మాత్రమేనా?
>> రొడ్డు పక్కన ఎదొ ఒక చెత్త చాట్ లో చాటుగా చాట్, గొల్ గప్ప తినాలి.. యమ్మీ.. నథింగ్ లైక్ ఇట్!
@purnima
>>Are you sure? - ఏదొ అల్పసంతొషం అనుకొండి.
>>మంచి తెలుగు సినిమా అనలేదు కదా? - ఈ మద్య మంచి సినిమాలు నెతి బీరకాలయిపొయాయి.
>>కిలో మాత్రమేనా? -flight వాడు 20kg లే అనుమతిస్తాడు. అందులొ కిలొ కంటె ఎక్కు పుస్తకాలంటే, అమ్మమ్మ పెట్టిన ఆవకాయకు place ఉండదు.
హైదరాబాద్ లో అడుగుపెట్టి తొడకొట్టండి చెబుతా. మంజీరా నీరు త్రాగి "ఏంపెట్టావయ్యా ఇందులో" అని ఒక డవిలాగు చెప్పాలి. ఇంక....
మీ టపా చదివినప్పటి నుంచి నాక్కూడా ఎప్పుడెప్పుడు మన భాగ్యనగరం దర్శించు దామా అని ఉంది, కాని నా ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి వచ్చే జూన్ వరకు నాకు వీలు అవకపోవచ్చు. ఎనీ వే మీకు హ్యాప్పీ జర్నీ.
హైదరాబాదు కి హృదయ పూర్వక స్వాగతం....
మంచి టైంలో వస్తున్నారు... జలాశయాలన్నీ జలకళతో కళకళలాడుతూ, రాష్ట్రంలో కరెంట్ కోతలు మానేసిన టైం....
వర్షాలు అప్పుడప్పుడే పడుతున్నా, చల్లగా హాయిగా వాతావరణం మారిపోయిన టైం,
చల్లచల్లని గాలులు వీస్తూఉంటే నెక్లెస్ రోడ్డులో సంధ్యా సమయాన టాంక్ బండ్ ఒడ్డున మొక్కజొన్న కండెలని వేడిగా కాల్పించుకొని, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం,కారం కలిసి టాంక్ బండ్ నీళ్ల వాసనలు కల్పుకొని ముక్కులు ఎగబీలుస్తూ ఉంటే హుషారుకొలిపే టైం....
రండి...రండి... దయచేయండి... హాయిగా ఎంజాయ్ చెయ్యండి...
కానీ నా సలహా... తెలుగు సినిమాలు మాత్రం చూడకండి... ఎక్కడైనా ఎప్పుడైనా మళ్లీ మళ్ళీ దొరుకుతాయి...
విశాలాంధ్ర లో కిలో బరువుకి దొరికే మంచి పుస్తకం, మీలాంటి వాళ్ళకి ఉపయోగపడేది.... పెద్దబాలశిక్ష....గాజుల సత్యనారాయణ గారిది...తెలుగు ప్రపంచానికి దూరంగా పొరుగు దేశంలో ఉంటున్న మీకు బాగా ఉపయోగ పడుతుందది.....
సరే... మీరు ఎలాగో అనుమతించారనుకోండి.... అత్తపుచ్చుల గురించి... అదే అచ్చుతప్పులు...సవరించకుండా ఉండలేను...
షంషాబాదు......(శంషాబాదు) గానే రాస్తున్నారిప్పుడు....
రొడ్డు .... రోడ్డు
ఇంటికెల్లే.....ఇంటికెళ్ళే
మూసినది.... మూసీ నది
మూర్చ .... మూర్ఛ
భాదించే..... బాధించే
భందువులు.... బంధువులు
ఇలా రాసేనని ఏం అనుకోరుగా...( మన తెలుగు కోసమే....)
అన్నట్టు శంషాబాద్ ఏర్ పోర్టు నుంచి బస్ ఎక్కి మెహదీ పట్నం వస్తే మీ సిటీ బస్ ప్రయాణం కోరిక తీరిపోతుందండోయ్... (సుఖంగా ప్రయాణం చెయ్యొచ్చు శ్రమ తెలియకుండా)
మరోసారి - హైదరాబాదుకి...పునఃస్వాగతం.....
@సుధారాణి
>>మీలాంటి వాళ్ళకి ఉపయోగపడేది.... పెద్దబాలశిక్ష...
అబ్బా!! కొట్టారండి పొలీసొడి దెబ్బ
సరే ఇక మీదట అచ్చు తప్పులు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను.
ఈ ఆదివారం (21న) పట్నంలో ఉంటారా? e-తెలుగు సమావేశంలో ఇక్కడి వాళ్ళని కలవవచ్చు.
""భాస్కల్" గాలు నా పేలు లచ్చిమి :)
నేను అయ్యిదలాబాదు లోనే వుంటా అండీ !!
మీకు మా వూలికి "స్వాగతం" "సుస్వాగతం"
సిటీ బస్ ఎక్కలన్న కోలిక ఆదివాలం ఐతే ప్లశాంతంగా తీలుతుంది
నెక్లస్ లోడ్ కి వాలాంతం లో (వీకెండ్) మాత్లం వెళ్ళకండి మాస్టాలు
ఛాట్ అంటాలా మీకు ప్లతీ చోటా కనిపిస్తాయి
ఇంకా చూడాల్సిన ప్లదేశాలు --దసలా కదా వుంటే శిల్పాలామం లో ఏమైనా కాల్యక్లమాలు వుండొచ్చు
వీవెన్ గాలు చెప్పినట్టు తెలుగు వాలందలితో కలవచ్చు
ఏదేమైనా "సంతోష ప్లయాణం(అదేనండీ హ్యాపీ జల్నీ)"
మల్చే పోయా అండీ!! తెలుగు సినిమా అడిగాలు కదూ
"అష్టా చెమ్మ " బానే వుంది అన్నాలండి మలి మీ ఇష్టం!!
ఇక పోతే "అప్పు తచ్చులు " సలి చెయ్యటానికి మన బ్లాగ్లోక పెద్దలు అందలూ వున్నాలు కదండీ చింత ఏలా???
@ వీవెన్ : ధన్యవాదాలు. నేను ఇల్లు చెరేసరికి ఆదివారం మద్యాహ్నం అవుతుంది. వీలు కాక పొవచ్చు, శాయాశక్తులా ప్రయత్నిస్తాను.
@ లచ్చిమి :ధన్యవాదాలు. అచ్చు తప్పుల పుణ్యమా అని ఇప్పడివరకే రెండు మొట్టికాయలు తిన్నాను
చిచ్చా!! బిర్యాని తినవానే???
Post a Comment