Tuesday, January 09, 2007

how NOT to get a job

ఇవాళ metro లో ఒక funny article చూసాను.
Amir Saffar అనే కెనడియన్ web developer కు Mike Plates అనే HR manager కు మద్య ఈ-మెయిల్స్. జాబు ఎలా తెచ్చుకోకుండా ఉండొచ్చో చెప్పే మంచి ఉదాహరణ.
how NOT to get a job

Wednesday, January 03, 2007

అసెంబ్లీ రౌడి

అనగనగా ఒక హీరొ. అమ్మాయిల బాత్రుం లలో దూరుతూ ఆడుతూ పాడుతూ ఉంటాడు. ఈ హీరొను విలంగాండ్లు తప్పుడు కేసుల ఇర్కిచ్చి జైల్లేపిస్తరు. మన హీరో జైల్ల కెల్లి పోటి చెసి MLA అయిపొయి విలన్ ది ఈపు పలగొడ్తడు. సీన్మ వంద రోజులాడింది.

అది పాత కత సారు కొత్త కత ఎందొ దెల్సా?

1993 వరుస భాంబు పేళ్ళులలొ ఎందరొ అమాయకుల ప్రానాలు దీసిన మన అబూ సలెం గాడు పార్టి పెట్టెసిండు MLA కు కూడ పోటి చెస్తడంత. ఆరు నూరు కావొచ్చు కాక పొవచ్చు కాని వీడు మాత్రం గెల్సేది ఖాయం.

థూ... గిసొంటి న్యూసు/న్యూసెన్సు చదివి/చూసి జెనాలు ఏది "నా కొత్తలొకం" అంటు పిచ్చొల్లైనా కావాలె లెదంటే స్వాతంత్రం వచ్చినందుకు భాదైనా పడాలె.
* * *

ఏమాట కామాటె సెప్పు కొవాలే. ఇట్ల జేసినొళ్ళలో ఈ అబూ సలేం గాడు ఫస్టేం గాదు. 20 ఎండ్ల కింద హాజి మస్తాన్ మీర్జా, బబ్లూ శ్రీవాత్సవ, అరుణ్ గావ్లి, మొన్నటికి మొన్న మన లల్లూ ప్రసాదు ఇలా చెప్పుకుంటూ పొతే చెంతాడంత లిస్ట్ తయారైతది. ఏ పార్టీ చూసినా ఎమున్నది గర్వ కారణం సమస్తం క్రిమినల్సు మయం! అని డిసైడు జెయ్యొచ్చు. అబూ సలేం లాంటెదవలు పార్టీ పెడితే పెట్టారు కాని ఇట్లాంటొళ్ళ పార్టిలల్ల జేరె బాగా చదువుకున్న వాళ్ళనేం జెయ్యాలే? అయినా డబ్బెవనికి చేదు?


మన అర్జున్ సింగొరు క్రిమినల్సుకు (వీళ్ళు మైనారిటి కాదని ఎవడన్నాడు) రిజర్వెషను ప్రకటించేస్తే సరి.
వీడ్ని కష్టపడి deport చేస్కొచ్చి ఇన్ని రోజులు కాలరెగరెస్కుంట తిర్గిన CBI వాళ్ళు మొనగాల్లయితే ఎలచ్చన్లలో పొటీ జేసి MLA కాబొయె వీడెమో మొనగాల్లకు మొనగాడు.



అశొక్ సరొగి, అదేనండీ మన అబూ సలేం గాని లాయరెదవ, ఎకంగా పెద్ద పార్టీ నే ఇచ్చిండంట పార్టీ స్టార్టు జెస్తున్న (అ)శుభ సందర్బంలో. మరి తర్లా సరొగి (ఈ అశొక్ సరొగి ఇల్లాలు) మాత్రం తక్కువ తిందా? అబూ సలేం గాని వీరొచిత జీవిత చరిత్రను సీన్మా దీస్తుందంట. సుడుండ్రీ ఈ సీన్మ 100 రొజులు నడవకపోతే జెప్పండి.

* * *

ఈనాడు శ్రీధర్ గారికి కార్టూన్ కు మాంచి ఐడియా.
మధ్యలొ ప్రజాస్వామ్యాన్ని చచ్చిన శవం లా గీసి చుట్టూ అంబేద్కర్, గాంధి ఎడుస్తున్నట్లు, పక్కన అబూ సలేం పొటీ చేసిన న్యూసు ఉన్న పేపరు గీస్తే సరి