ఊరు
శాన రొజుల్నిండి బ్లాగు మొదలు పెట్టాలని అనుకుంటూ ఉన్నను.
మరీ శాన రొజులంటె వొ రెండు మూడు నెలల్నించి, అవి మీకు శాన రొజులొ కాదొ నాకు తెల్దు.
బ్లాగు అన్నక ఎదొ ఒకటి చెప్పలి, మీరు వినాలి. ఆమాటకొస్తె ఎదొ ఒకటి చెప్పాలని మహా ఇది గా ఉన్నవాల్లె, వినడానికి ఏ పని లెనొడు దొరక్క పొతె బ్లాగు మొదలు పెట్టెస్తార్ట!!.
మా ఊరు పేరు మహాసముద్రం అందుకె నా బ్లాగు పెరు కూడ అదెపెట్టెసెను.
ఈ భూప్రపంచెంలొ మంచి ఊరు లండనా? మాసొద్రమా? అంటె నెను కళ్ళు మూసుకొని మాసొద్రం అనెస్తాను.(కళ్ళు మూసుకొని అనడం దెనికొ నాకు తెల్దు).
మాసొద్రం అంతె పెద్ద సెరువొ, వాగొ, నదొ పక్కనుందె చిన్న ఊరనుకునేరు. మా ఊర్లొ ఒక్క ఎండా కాలం ఎంటీ వర్షాకాలం, చలికాలం కూడా నీళ్ళు దొరకవు ఒక్కొసారి. మహబూబ్ నగర్ జిల్లలొ, కొల్లాపూర్ తాలూకాలొ అదొక చిన్న ఊరు. మహా అంటె ఒక 350 వందల మంది ఉంటారెమూ, అందులొ కూదా "మీ ఊరెది?" అని ఎవరన్న అడిగితె హైద్రాబాదు అనె సెప్పేవొల్లె షానా ఎక్కువ.
మా ఊర్లొ ట్యుబుల్లెవు [అసలు బస్సే రాదు], కెనరీ వార్ఫ్ లాగ పెద్ద పెద్ద బిల్డింగులూ లేవు [ఆ మాట కొస్తే కంక్త్రీటు మిద్దెలెలెవు ఒక్క పాత స్కూల్ బిల్డింగ్ తప్ప]. లండన్ లొ ఎన్ని వున్నా మా ఊరి ముందు దిగదుడుపే!!





1 comments:
మీ ఊరి గురించి బాగా చెప్పారు. 'బస్ కర్ ' అనంగానే మా రూంమేట్ నాకు తెలీకూండా బ్లాగ్ రాసేస్తున్నడేమో అనుకున్నా.
మీరు అలా కాగితం మీద రాసి స్కాన్ చెయ్యటం కాకుండా తెలుగు ఫాంట్ లొ టైప్ చెయ్యగలరు.
Post a Comment