మాంచి నిద్రలొ ఉన్న మా అబ్బాయికి గట్టిగా ముద్దిచ్చి వాడిని మా ఆవిడకు తిరిగి ఇచ్చేసి లగేజి తో చెకింగ్ కౌంటర్ వైపు బయలు దేరాను. లగేజి చెకింగ్ చేసి ఇమ్మిగ్రేషను కౌంటర్ ఉన్న ఆంటీ కి పాస్‌పొర్టు, ఫాం ఇచ్చాను. క్యూ లొ నా వెనకాల ఎవరూ లేరు. వెనక్కి తిరిగి మా ఆవిడ కనపడుతుందేమో అని వెదుకుతూ ఉన్నా, వెళ్ళిపొయి నట్లున్నారు.
ఇమ్మిగ్రేషను ఆంటీ నా పాస్‌పొర్టు ను యండమూరి నవల్లాగా చదివేస్తుంది.
పాస్‌పొర్టు లొ ఉన్న ఫొటొను నన్ను తెరిపార చూసింది.
మీ ఊరు కొల్లాపూరా అంది.
అవును మేడమ్
ఏ క్యాస్టు?
ఇమ్మిగ్రేషను వాళ్ళు ఇలాంటి question కూడా అడుగుతారా అనుకొని అఇష్టంగానే సమాధానం ఇచ్చాను.
మీ ఊర్లొ ఇంకా నక్సలైట్లు ఉన్నారా?
మరి నేనెవరనుకున్నారు అందామనుకున్నా మళ్ళి జోకు శ్రుతి మించుతుందేమో అని లేరు మేడమ్ అన్నాను
నిన్ను చూస్టే 75 born లా అనిపించదం లేదు అంది.
(ఒక్కసారిగా ఉబ్బి అర మీటరు గాల్లొకి లేచాను)
ఊరుకొండి మేడమ్ ఇవ్వాలే లెక్కపెట్టాను 179 తెల్ల వెంట్రుకలు ఉన్నాయి అన్నా
కిస్సుక్కున నవ్వి అబ్బొ అంత కరెక్టుగ గెట్ల లెక్కబెట్టినవ్ అని పాస్‌పొర్టు తిరిగి ఇచ్చేసింది.
* * *
16 గంటల సుధీర్గ ప్రయాణం తర్వాత ఇల్లు చేరాను. ఇల్లు తాళం తీస్తుంటే ఎదో వెలితిగా అనిపించింది. మళ్ళీ తాళం వేసి వెనక్కి వెళ్ధామా అనిపించింది. ఇంట్లో అడుగు పెట్టాను. ఇల్లంతా నిండుగా, ఖాలీగా ఉంది. ఎక్కడ చూసినా మావాడి బొమ్మలే. చిన్నప్పుడు 5 నించి 10 వ తరగతి వరకు బీచుపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో చదివెప్పుడు కేవలం సెలవులకు మాత్రమే ఇంటికి పంపేవాళ్ళు. సెలవుల నించి తిరిగి స్కూల్‌కు వచ్చాక రెండు మూడు రొజులు బాగా homesick ఉండేది. అచ్చం ఇప్పుడు కూడా అలాగే ఉంది. I will surely miss my son & wife. ఒక నెలే కదా అని సరి పెట్టుకుంటున్నా.